‘మీ సమయం అయిపోయింది’.. కవిత సంచలన పోస్ట్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సేన​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన పోస్ట్ పెట్టారు. ‘ఇక మీ సమయం అయిపోయింది, మా సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. నిన్న కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించిన వెంటనే.. బీఆర్ఎస్ పార్టీ నేతలు సెటైర్లతో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికీ కౌంటర్ గా కవిత తన సోషల్ మీడియాలో ఇలా రాయడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ పేరుపై రాజకీయ వర్గాల్లో చర్చ..

కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించడం ఒకింత రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న జాగృతి పేరు మీదనే పార్టీ ఏర్పాటు చేస్తారని అంతా ఊహించారు. కానీ, ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే ప్రజల ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తు పరిణామాలనే ఊహించి కవిత వ్యూహాత్మకంగా పార్టీ పేరును చివరి నిమిషంలో మార్చి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>