అన్నదాతల కోసం ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: ఇండస్ట్రియల్ కారిడార్ రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను వికారాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1000 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారంటూ రాపోల్, కాడ్లపూర్ గ్రామాల రైతులు 30 రోజులుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో దీక్ష చేస్తున్నారు. బుధవారం కవిత (Kalvakuntla Kavitha) దీక్షా శిబిరానికి వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..  ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుండటంతో మొత్తం 1200 మంది రైతులు నిరాశ్రయులు అవుతున్నారని కవిత పేర్కొన్నారు.  జిల్లా కలెక్టర్ తోనూ ఈ అంశంపై  కవిత చర్చించారు. వెంటనే ఆయా గ్రామాలకు వెళ్లి గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనకు ధర్మస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కూడా మద్దతు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళనకారులను, జాగృతి అధ్యక్షురాలు కవితను అదుపులోకి తీసుకొని వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>