కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతోంది: కడియం శ్రీహరి

కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతోందని.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంస్కారహీన వ్యాఖ్యలు సిగ్గుచేటని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంబొత్సవానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామంలో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, 48 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఎస్సీ, రజక కమ్యూనిటీ హాళ్లు, ముదిరాజ్ కమ్యూనిటీ హల్ ప్రహరీ గోడ మొత్తం 3 కోట్ల 62 లక్షల విలువైన అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూన్నాయని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలులో రైతులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కడియం విమర్శించారు. గన్ని బ్యాగుల కొరత, గోదాములు ఖాళీ లేక ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరుగుతుందని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. అధికారంలో ఉన్ననాడు అడ్డగోలుగా దోచుకొని వందల ఎకరాలు, వేల కోట్లు, ఫామ్ హౌస్ లు కట్టుకున్న వారే ఈ రోజు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్‌కు, బీఆర్ఎస్‌కు ఎంత అక్కసు ఉందో ఆ మాటలు వింటేనే అర్థం అవుతుందన్నారు. ఇక 12ఏళ్లుగా తెలంగాణకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టు ఇవ్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నడుస్తున్న వ్యక్తికి కాళ్ళల్లో కట్టె పెట్టినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తోట నాగరాజు, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>