మరోసారి హెల్త్ కమిటీలో కడియం కావ్య

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya)కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (2026–27)లో మరోసారి సభ్యురాలిగా అవకాశం లభించింది. సెప్టెంబర్ 26 నుంచి ఆమెను కమిటీ సభ్యురాలిగా నామినేట్ చేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ అక్టోబర్ 3న అధికారికంగా తెలిపింది.

వైద్యురాలిగా ప్రజారోగ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కడియం కావ్య, పార్లమెంట్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్, ఆధునిక వైద్య సాంకేతికత, AI ఆధారిత వైద్య విధానాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణ వంటి అంశాలను ప్రస్తావించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేలా దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కార్యక్రమాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

మహిళలు, గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యం, వ్యాధుల నివారణ, క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య మౌలిక వసతుల బలోపేతం వంటి అంశాలను కమిటీ ద్వారా జాతీయ స్థాయిలో ప్రస్తావించేందుకు కృషి చేస్తానని కడియం కావ్య తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>