కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తనదైన శైలిలో స్పందించారు. కేవలం తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌తో ఏర్పడిన రాజకీయ విభేదాల వల్లే కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఏ విధంగా అయితే నిలదొక్కుకోలేకపోయాయో, కవిత పార్టీకి కూడా అదే గతి పడుతుందని పాల్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీపై ఉన్న వ్యామోహం, కుటుంబ సభ్యులపై ఉన్న కోపంతోనే ఆమె ఈ అడుగు వేశారని ఎద్దేవా చేశారు.
తెలంగాణను సర్వనాశనం చేయడానికే కవిత ఈ పార్టీని స్థాపించారని పాల్ (KA Paul) ఆరోపించారు. ఆమెను నమ్మవద్దని స్వయంగా కేసీఆర్ 2008లోనే తనకు చెప్పారని ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. కవిత వెనుక ఉండి ఎవరు ఈ పార్టీని పెట్టిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిలకడలేని వ్యక్తులను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని పాల్ విన్నవించారు.
Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!
Follow Us On: X(Twitter)

