కరీంనగర్ జ్యూవెలరీ షాప్‌ కాల్పుల ఘటనపై మంత్రి పొన్నం ఆరా

కలం, కరీంనగర్ : పట్టణంలోని పిఎంజె జ్యూవెలరీ షాప్‌ (PMJ Jewellery Shop) లో జరిగిన దుండగుల కాల్పుల ఘటనపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) ఆరా తీశారు. ఈ ఘటనపై ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీస్ కమిషనర్, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాల్పులలో గాయపడిన జ్యువెలరీ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరగా అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు. ప్రజలు భయపడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>