యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్​కు కేఏ పాల్ సంచలన ఆఫర్​​

కలం, వెబ్​ డెస్క్​: ఇరాన్​, అమెరికా–ఇజ్రాయెల్​ యుద్ధంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​(KA Paul) సంచలన ప్రకటన చేశారు. యుద్ధం ఆపేందుకు ఇరాన్​తో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు. తాను చర్చలు పూర్తిచేసేందుకు వీలుగా 72 గంటల పాటు యుద్ధం ఆపాలంటూ అమెరికా, ఇజ్రాయెల్​కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్​’ ఖాతాలో శుక్రవారం ఒక ట్వీట్​ పోస్ట్​ చేశారు. ఇరాన్​ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకి భారత్​లో పత్యేక ప్రతినిధి అయిన​ అబ్దుల్​ మజీద్​ హకీమ్​ ఇలాహీని కలిసిన ఫోటోను ట్వీట్​కు జతచేశారు. ఇలాహీతో చర్చలు జరిపినట్లు పాల్​ వెల్లడించారు.

తాను ఇరాన్ (Iran)​ తరఫున మధ్యవర్తిత్వం వహించి, యుద్ధ విరమణకు కృషి చేసేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)​, ఇజ్రాయెల్​ నేతలకు కేఏ పాల్ (KA Paul)​ విన్నవించారు. ఇరాన్​తో తాను శాంతి చర్చలు జరుపుతానని, 72గంటల పాటు సీజ్​ఫైర్​ చేయాలని కేఏ పాల్​ వాళ్లను కోరారు.

Read Also: ఎప్​స్టీన్​ ఫైల్స్​ సంచలనం.. మైనర్​పై ట్రంప్​ అకృత్యాలు!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>