ఉక్రెయిన్ బ్యూటీతో మంచు మనోజ్‌ రొమాన్స్.. ఇంటెన్సివ్ లుక్‌లో మారియా

కలం, వెబ్ డెస్క్: మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం డేవిడ్ రెడ్డి ద్వారా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా (Maria Ryaboshapka) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చారిత్రక యాక్షన్ మూవీలో క్లారా అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేసింది. బ్రిటిష్ కాలంనాటి నేపథ్యంలో సాగే ఈ కథలో మరియా పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఆమె లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉందంటూ మేకర్స్ వెల్లడించారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎవరీ బ్యూటీ

ప్రముఖ ఉక్రేనియన్ మోడల్, నటి మరియా ర్యాబోషప్కా (Maria Ryaboshapka). ఈ బ్యూటీ శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ (2022) సినిమాతో పరిచయమైంది. అంతకుముందు హిందీ వెబ్ సిరీస్లో కనిపించింది. ఇప్పుడు మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా వస్తున్న డేవిడ్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. తన అందం, అభినయంతో ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

Read Also: ‘F1: ది మూవీ’ సీక్వెల్‌పై లూయిస్ హామిల్టన్ క్రేజీ అప్‌డేట్!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>