Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్ బాక్సింగ్ జట్టులో కీలక మార్పు.. ఇద్దరికి అదనపు అవకాశం

క‌లం, వెబ్ డెస్క్: ప్రపంచ బాక్సింగ్ కప్ 2026 స్టేజ్-2 కోసం భారత జట్టులో జ్యోతి, ఆకాశ్‌లకు అదనపు అవకాశం లభించింది. భారత బృందం 18 మంది నుంచి 20 మందికి పెరిగింది. టోర్నీకి ప్రభుత్వ ఆమోదం పొందిన తుది జట్టులో వీరిద్దరూ లేకపోయినా, బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ జోక్యంతో వారికి అవకాశం లభించింది. దీంతో జ్యోతి, ఆకాశ్ గుయాంగ్‌లో భారత జట్టుతో చేరి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని పొందారు.ఈ నిర్ణయం ద్వారా వీరిద్దరికీ ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో తలపడే అవకాశం లభించడమే కాకుండా, అంతర్జాతీయ ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించే అవకాశం కూడా కలుగుతుందని బీఎఫ్‌ఐ పేర్కొంది.

అథ్లెట్ల అభివృద్ధికి అంతర్జాతీయ పోటీలు చాలా ముఖ్యమని, అర్హత సాధించిన ప్రతి బాక్సర్‌కు ప్రపంచ స్థాయి వేదికపై తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రావాలని అజయ్ సింగ్ తెలిపారు. జ్యోతి, ఆకాశ్ ఈ అవకాశానికి అర్హులని, వారి అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.వీరిద్దరూ జట్టులో చేరడంతో భారత బృందం సంఖ్య 18 నుంచి 20 మందికి పెరిగింది. ఇప్పుడు జట్టులో 10 మంది పురుషులు, 10 మంది మహిళా బాక్సర్లు ఉన్నారు.

ప్రపంచ బాక్సింగ్ కప్ 2026 (స్టేజ్-2) భారత జట్టు

మహిళల జట్టు (10 మంది) :

జ్యోతి (48 కేజీలు)

మీనాక్షి (51 కేజీలు)

పూనమ్ (54 కేజీలు)

ప్రాచీ (57 కేజీలు)

మాహి లామా (60 కేజీలు)

సనేహ్ (65 కేజీలు)

గిటిమోని జి (70 కేజీలు)

సనమాచా సి (75 కేజీలు)

నైనా (80 కేజీలు)

అల్ఫియా తరన్నుమ్ అక్రమ్ ఖాన్ పఠాన్ (+80 కేజీలు)

పురుషుల జట్టు (10 మంది):

రిషి ఎస్ (50 కేజీలు)

నిఖిల్ (55 కేజీలు)

అన్మోల్ (60 కేజీలు)

అభినాష్ జమ్వాల్ (65 కేజీలు)

దీపక్ (70 కేజీలు)

ఆకాశ్ (75 కేజీలు)

మల్సావ్మ్‌ట్లువాంగా (80 కేజీలు)

జుగ్నూ (85 కేజీలు)

హర్ష్ చౌదరి (90 కేజీలు)

సావన్ జి (+90 కేజీలు)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>