జూరాల నీటి విడుదల.. బీఆర్‌ఎస్‌ పోరాట ఫలితమే: వాకిటి శ్రీధర్‌

కలం, వనపర్తి: జూరాల ప్రాజెక్టు నుంచి రైతాంగానికి నీటిని (Jurala Water) విడుదల చేయడం బీఆర్‌ఎస్‌ (BRS) పోరాట ఫలితమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌ (Vakiti Sridhar) అన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యక్ష పోరాటానికి పిలుపునివ్వడంతోనే ప్రభుత్వం స్పందించిందని ఆరోపించారు.  కర్ణాటక ప్రభుత్వాన్ని ముందుగానే సంప్రదించి ఉంటే రైతులకు నష్టం తప్పేదని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రచారం ఎక్కువ.. పనులు తక్కువ

జూరాల నీటి (Jurala Water) కేటాయింపులపై ఎమ్మెల్యే మేఘారెడ్డి చేస్తున్న ప్రకటనల్లో అవగాహన లోపించిందని విమర్శించారు. ‘299 టీఎంసీల నీరు కేటాయించారంటూ చేస్తున్న ప్రచారం వాస్తవాలకు భిన్నం’ అని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రచారం ఎక్కువ.. పనులు తక్కువగా ఉన్నాయని విమర్శించారు.

సాయిచరణ్‌రెడ్డిపై విచారణ జరపాలి

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీగా వ్యవహరించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలపై సాయిచరణ్‌రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వాకిటి శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. మణికొండలో సాయిచరణ్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయని పేర్కొంటూ, ప్రభుత్వం స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. ఈ సమావేశంలో నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, గంధం పరంజ్యోతి, ఎద్దుల సాయికుమార్, ఎం.రాజశేఖర్, పెద్దింటి వెంకటేష్, నాగన్న యాదవ్, బొబ్బిలి ప్రేమ్‌కుమార్, నీలస్వామి, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

Also Read : రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పీఎస్‌లోనే ఫైట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>