Mobile Popup Ad
Mobile Popup Ad

SIHM బలోపేతంతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు.. మంత్రి జూపల్లి

క‌లం, మెద‌క్ బ్యూరో: గ్రామీణ యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐహెచ్‌ఎం) సంస్థను రూ.5 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జ‌హీరాబాద్ ఎస్‌ఐహెచ్‌ఎంలో నిర్వహించిన పర్యాటక వారోత్సవాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులతోపాటు నిథమ్ (NITHM) విద్యకు సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఎస్‌ఐహెచ్‌ఎంను మళ్లీ ప్రారంభించడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్వయం ఉపాధి లభిస్తుందన్నారు.

ఎస్‌ఐహెచ్‌ఎంలో (SIHM) చేరిన పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువత ప్రైవేట్ రంగాల్లోని అవకాశాలను అందుకోవడానికి పర్యాటక, ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను అందించాలని నిథమ్ డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, మాజీమంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.

Read Also: రోడ్లపై నమాజ్.. యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>