కలం, బాసర: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం బాసర చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్వాగతం పలికారు. స్థానిక రాజన్న అతిథి గృహంలో మంత్రికి పూల మొక్కను అందించారు. అనంతరం పోలీస్ అధికారులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. మంత్రికి స్వాగతం పలికినవారిలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

