కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలోని డైట్ కళాశాలలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో జరుగుతున్న వివిధ విభాగాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
క్షేత్ర స్థాయి నుంచి వచ్చే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) పేర్కొన్నారు. అదే సమయంలో తరచూ వచ్చే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మావల జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రైమరీ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : ‘స్మో-కింగ్’ వచ్చేస్తున్నాడు.. NBK 111 నుంచి క్రేజీ అప్డేట్
Follow Us On: X(Twitter)

