కలం, వెబ్ డెస్క్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ (Jr NTR) నటనలోనే కాకుండా అద్భుతమైన వంటలు చేయడంలోనూ ప్రతిభావంతుడనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను తయారుచేసిన కుకీల్ని తారక్ సోషల్ మీడియాలో పెట్టాడు. వీటిని బయట కొనలేదని, తనే తొలిసారి ట్రై చేసి, బేక్ చేసి తయారుచేశానని చెప్పుకొచ్చాడు. జూ.ఎన్టీఆర్ శుక్రవారం చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘అడ్రస్ పెట్టు… అడ్రస్ పెట్టు’
అయితే సాయి తేజ అనే అభిమాని .. ”మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీస్ పంపు అన్నా” అని జూ.ఎన్టీఆర్ పెట్టిన పోస్టులో కామెంట్ చేశాడు. దీంతో అప్పుడు జూ. ఎన్టీఆర్ ‘అడ్రస్ పెట్టు… అడ్రస్ పెట్టు’ అని రిప్లై ఇచ్చారు. అయితే జూ.ఎన్టీఆర్ మాములుగానే అలా రిప్లై ఇచ్చేశాడని అనుకున్నరంతా. కానీ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ తాను తయారు చేసిన కుకీస్‌ను సదరు అభిమాని ఇంటికి తారక్ పంపించేశాడు.
ఈ మేరకు తన ఆటోగ్రాఫ్‌తో కూడిన కుకీస్‌ను సాయి తేజ ఇంటికి పంపించారు. ఊహించని విధంగా తన అభిమాన హీరో నుంచి వచ్చిన బహుమతి చూసి సాయి తేజ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తారక్ పంపించిన కుకీస్ ను ఫొటో తీసి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. తన పిల్లలతో కలిసి కుకీల్ని తింటూ సదరు అభిమాని సంబరపడిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

