Mobile Popup Ad
Mobile Popup Ad

పబ్‌‌లో కూకట్‌పల్లి డీసీపీ తనిఖీలు.. షాకింగ్ దృశ్యాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు పబ్‌ల్లో జరుగుతున్న అశ్లీలమైన పనులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కూకట్‌పల్లిలోని (Kukatpally) కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో తెల్లవారుజామున డీసీపీ రితి రాజ్ తనిఖీలు చేపట్టగా.. షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యం అమ్మాయిలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అంతేగాకుండా వారితో చాటింగ్ చేయిస్తూ యువకులను పబ్‌కు రప్పిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి, అర్ధరాత్రి వరకు డీజే పాటలతో హంగామా చేయిస్తూ, చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీపీ ఆదేశాలతో పబ్‌లోని విటులతో పాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.

ఎంతగా హెచ్చరించినా.. మారని తీరు

పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా, నిఘా పెడుతున్నా పబ్‌ల్లో అసాంఘిక కార్యక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాదాపూర్, కూకట్ పల్లి, ఫిలింనగర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పబ్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పట్టించుకోకుండా, అర్ధరాత్రి దాటిన తరువాత కూడా హంగామా కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్, ఈగిల్ పోలీసులు అడపాదడపా దాడులు చేసి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిపై పర్యవేక్షణ మరింత పెరగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>