Mobile Popup Ad
Mobile Popup Ad

గద్దర్ అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉంది : భట్టి

కలం, వెబ్ డెస్క్ : సినీ సెలబ్రిటీలకు గద్దర్ అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). తెలంగాణ గద్దర్ అవార్డులు వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాల్గొని పలువురికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు ప్రోత్సాహంగా గద్దర్ అవార్డులు అందజేస్తున్నామని.. గత ప్రభుత్వం పదేళ్ల పాటు అవార్డులను నిలిపివేసిందని చెప్పారు. కానీ ఆపేసిన అవార్డులను తిరిగి తెలంగాణ గొప్ప కళాకారుడు గద్దర్ పేరుతో ఇవ్వాలనే నిర్ణయం తాము తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

తెలుగు సినిమాలు ప్రస్తుత రోజుల్లో హాలీవుడ్ స్థాయికి వెళ్తున్నాయని.. అలాంటి చలనచిత్రానికి ప్రోత్సాహక అవార్డులు ఇస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. కమిటీ సభ్యులు నిష్పక్షపాతంగా లిస్టును రెడీ చేస్తున్నారని.. వాళ్లందరినీ ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. అవార్డులు అందుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>