గాంధీ జయంతి డ్రై డే.. బెల్టు షాపుల్లో మద్యం హవా?

కలం, జగిత్యాల: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న డ్రై డే అమలులో ఉండటంతో వైన్‌ షాపులు, బార్లు మూసివేయాల్సి ఉంది. అయితే జగిత్యాల గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామాల్లో అనధికారికంగా మద్యం విక్రయాలు (Illegal Liquor Sales) కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిరాణా దుకాణాలు, చిన్నపాటి షాపులు, ఫ్రై సెంటర్లు తదితర ప్రాంతాల్లో మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. డ్రై డే రోజున కూడా మద్యం లభిస్తుండటంపై నిషేధం అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైన్‌ షాపులు బంద్‌.. బెల్టుల్లో మాత్రం విక్రయాలా?

అధికారిక మద్యం దుకాణాలు మూసివేసినా.. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల సాధారణ వైన్‌ షాపులను తలపించే విధంగా విక్రయాలు సాగుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. నిషేధిత రోజుల్లో మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? అనధికారికంగా విక్రయిస్తున్న వారికి మద్యం ఎలా చేరుతోంది? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాలని జగిత్యాల మండల ప్రజలు కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

బెల్టు షాపులపై ఎక్సైజ్‌, పోలీసు శాఖల అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని జగిత్యాల మండల ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నా.. తనిఖీలు, చర్యలు కనిపించడం లేదని వారు అంటున్నారు. “వైన్‌ షాపులు, బార్లు మూసివేసిన రోజులలో కూడా బెల్టు షాపుల్లో మద్యం ఎలా లభిస్తోంది?” అని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల మండలంలోని గ్రామాల్లో రాత్రివేళల్లోనూ మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. మద్యం సులభంగా లభించడం వల్ల రాత్రివేళల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతపై కూడా దీని ప్రభావం ఎంతగానే పడుతోందని మండల ప్రజలు చెప్తున్నారు.

జగిత్యాల మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి

డ్రై డే నిబంధనలు కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాల గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల మండల ప్రజలు కోరుతున్నారు. నిషేధిత రోజుల్లో మద్యం సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఎవరి ద్వారా జరుగుతోందనే అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేయాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>