గద్వాలలో వ్యవసాయ కరెంట్ కోసం రైతుల ధర్నా

కలం,‌ జోగులాంబ గద్వాల: వ్యవసాయానికి విద్యుత్ సరిగా అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధా రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేటీ దొడ్డి మండలం‌ మైలగడ్డ స్టేజ్ వద్ద వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసిస్తూ మండల రైతులు చేపట్టిన రోడ్డు ధర్నా (Farmers Protest) కార్యక్రమానికి బీజేపీ నాయకులతో కలిసి ఆమె పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ​లో-వోల్టేజ్ సమస్యతో బోర్లకు సరిపడా నాణ్యమైన కరెంట్ అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. తక్కువ వోల్టేజ్‌తో తరచూ విద్యుత్ అంతరాయాలు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మార్చకపోవడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతల వల్ల రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల రైతుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ధర్నా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ డీఈ రవిప్రసాద్‌తో నాయకులు మాట్లాడగా.. రైతులకు ఏర్పడుతున్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు ధర్నా కార్యక్రమాన్ని విరమించారు.

​ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, BJYM జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు దరూర్ కిష్టన్న, OBC మోర్చా అధ్యక్షుడు దాస్, మండల అధ్యక్షుడు శ్రీపాద రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ మండల సీనియర్ నాయకులు, కేటీ దొడ్డి మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>