Mobile Popup Ad
Mobile Popup Ad

తన ఇంటిపై జరిగిన దాడిని పరిశీలించిన జోగి రమేశ్

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) ఇంటిపై తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు దాడికి దిగారు. కృష్ణ జిల్లా ఇబ్రహీం పట్నంలోని జోగి రమేశ్ నివాసంపై టీడీపీ శ్రేణులు రాళ్ళు విసురుతూ రచ్చ రచ్చ చేశారు. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పై జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రగిలిపోయిన తెలుగు తమ్ముళ్ళు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో జోగి రమేశ్ ఇంటిలో లేకపోవడంతో.. తన నివాసంపై జరిగిన దాడి గురించి టీడిపి నాయకులపై మండిపడ్డారు. తాజాగా తన నివాసానికి చేరుకున్న జోగి రమేశ్ దాడి జరిగిన తీరును పరిశీలించారు. చంద్రబాబు, లోకేశ్ సారధ్యంలో జరిగిన దాడి గురించి కాసేపట్లో మీడియా సమావేశంలో వివరించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>