కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి భారీ దెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులకు నిరసనగా యూఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జో కెంట్ (Joe Kent) తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడి, లాబీయింగ్ వల్లే ట్రంప్ ఈ యుద్ధానికి దిగారని కెంట్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ అనవసర యుద్ధాన్ని సమర్థించలేకే తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని మండిపడ్డారు. ట్రంప్ గతంలో నమ్మిన ‘అమెరికా ఫస్ట్’ విధానానికి విరుద్ధమని ఆయన రాజీనామా లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

