హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జేఎన్టీయూ (JNTU Hyderabad)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజు విక్రమ్ బాబు (19) అనే విద్యార్థి క్యాంపస్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను బీ.టెక్ మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతోనే మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందినవాడిగా తోటి విద్యార్థులు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా.. అనేది ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ సిబ్బంది మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>