epaper
Sunday, March 1, 2026
epaper

కశ్మీర్​ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు లేఖ

కలం, వెబ్​ డెస్క్​: కర్నూలు నర్సింగ్​ కాలేజీలో చదువుతున్న కశ్మీర్​ విద్యార్థినుల మీద (Kashmir Students) వేధింపులపై జమ్మూ అండ్​ కశ్మీర్ స్టూడెంట్స్​ అసోసియేషన్​ ​(జేకేఎస్​ఏ) తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది.

ఈ కాలేజీలో కొన్నాళ్లుగా కశ్మీరీ విద్యార్థినులపై మతం, ప్రాంతం, వస్త్రధారణ పరంగా వేధింపులు జరుగుతున్నాయని ఆ లేఖలో జేకేఎస్​ఏ పేర్కొంది. ఇటీవల రంజాన్​ మాసంలో ఇవి మరింత తీవ్రమైనట్లు తమ దృష్టికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. రంజాన్​ నెలలో ప్రత్యేక ఏర్పాట్లకు కాలేజీ సిబ్బంది నిరాకరించడం, హిజాబ్​ ధరించవద్దని ఒత్తిడి చేయడం, తిట్లతో మానసిక హింసకు గురిచేస్తున్నట్లు తెలిసిందని పేర్కొంది.

‘దాదాపు రెండు డజన్ల మంది కశ్మీరీ విద్యార్థినులు(Kashmir Students) ఈ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్​ కోర్సు చదువుతున్నారు. వీళ్లలో ఎక్కువ మంది ప్రధానమంత్రి స్పెషల్​ స్కాలర్​షిప్​ కింద చేరినవాళ్లే. అయితే, వీళ్లంతా కాలేజీలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మతం, ప్రాంతం, వస్త్రధారణ కారణంగా వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. రంజాన్​ మాసంలో ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. వీటిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి. కారకులపై చర్యలు తీసుకోవాలి. కశ్మీర్ విద్యార్థినులకు అండగా నిలవాలి’ అని ఆ లేఖలో జేకేఎస్​ఏ కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!