సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని విమర్శించారు. పార్టీపై కాంగ్రెస్ అధిష్ఠానానికి పట్టు తప్పిందని, రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో పార్టీని ఖతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కేసీఆర్ తన వయసును గౌరవిస్తారని, ‘అన్న’ అని ఆప్యాయంగా పిలుస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల గౌరవం లేదని, కానీ కేసీఆర్‌కు ప్రజలంటే ఎంతో గౌరవమని కొనియాడారు. కార్యకర్తల ఆత్మాభిమానం దెబ్బతినడం, నియోజకవర్గంలో జరిగిన పరిణామాల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ చేరేందుకు నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>