కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు (Waradhanapet MLA Nagaraju) ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పోలీసులను బెదిరిన్నాడని, పోలీసుల ఆత్మ స్థైర్యాని దెబ్బకొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గౌరవప్రదమైన పోస్ట్‌లో ఉన్న కరీంనగర్ సీపీని కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) అవమానిస్తున్నారని, గుండాయిజం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డ ముఠా పోలీసులను కూడా బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.
Read Also: పద్మ అవార్డులు-2027.. కేంద్రం కీలక ప్రకటన
Follow Us On: Instagram

