epaper
Wednesday, February 18, 2026
epaper

జేఈఈ మెయిన్​ ఫైనల్ కీ రిలీజ్​.. 9 ప్రశ్నలు ఔట్​

కలం, వెబ్​ డెస్క్​: జేఈఈ మెయిన్ ​(JEE Main 2026) 2026 సెషన్​ 1 ఫైనల్​ కీ రిలీజ్ అయ్యింది. పేపర్​ 1(బీఈ/బీటెక్​) కు సంబంధించిన సమాధానాల తుది కీని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) సోమవారం విడుదల చేసింది. ప్రొవిజనల్​ కీపై వచ్చిన అభ్యంతరాలతో 9 ప్రశ్నలను తొలగించింది. ఇందులో ఫిజిక్స్​ నుంచి ఏడు కొశ్చెన్స్​ ఉండగా, మ్యాథమెటిక్స్​ నుంచి 2 ఉన్నాయి. కెమిస్ట్రీ విభాగంలో ఎలాంటి తొలగింపులూ లేవు.

ఫైనల్​ కీని https://jeemain.nta.nic.in/ వెబ్​సైట్​లో చెక్​ చేసుకోవచ్చు. (JEE Main 2026) ఫైనల్​ కీని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. కాగా, ఎన్​టీఏ ఈసారి రెండు కీ లను అప్​లోడ్​ చేసింది. ఉదయం కరెక్ట్​ ఆప్షన్స్​తో కూడిన కీ రిలీజ్​ చేయగా, మధ్యాహ్నం కరెక్ట్​ ఆప్షన్స్​ ఐడీలను విడుదల చేసింది. ఉదయం విడుదల చేసిన వాటిలో దేశ, విదేశీ అభ్యర్థులకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో షిఫ్ట్​ వైజ్​, డేటా వైజ్​గా డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ క్యాండిటేట్స్​ ఫలితాలు వెల్లడించారు. మధ్యాహ్నం దేశ, విదేశాల్లోని సెంటర్ల వారీగా ఫలితాలు రిలీజ్​ చేశారు.

ఏ క్షణమైనా ఫలితాలు..

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్​ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయేజిత జీఎఫ్​ఐటీలు, ఐఐటీల్లో బీఈ, బీటెట్​, బీఫార్మా, ఆర్కిటెక్ట్​లో ప్రవేశానికి జేఈఈ మెయిన్​ 2026 సెషన్​ 1ను జనవరి 21 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో పేపర్​ 1, పేపర్​ 2 పరీక్షలు ఆన్​లైన్​లో నిర్వహించారు. పేపర్​ 1(బీఈ/బీటెక్​)కు 13లక్షల మందికి పైగా అప్లయ్​ చేసుకొని, 95శాతానికి పైగా రాశారు. ప్రొవిజినల్​ కీని ఈ నెల 4న విడుదల చేసిన ఎన్​టీఏ.. నేడు ఫైనల్​ కీ రిలీజ్​ చేసింది. షెడ్యూల్​ ప్రకారం ఫిబ్రవరి 16 లోపు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అందువల్ల ఏ క్షణంలో అయినా తుది ఫలితాలు రావచ్చు.

Read Also: న్యాయవాది స్వప్న హత్యకేసు.. డీజీపీ నివేదిక కోరిన హెచ్ఆర్​సీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>