కలం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఎన్ఐటీలు, ఐఐటీలు, సీఎఫ్టీఐల్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్–2026 (JEE Main 2026) ప్రొవిజినల్ ఆన్సర్ కీ రిలీజైంది. గత నెల 21 నుంచి 29 వరకు సెషన్–1 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ప్రొవిజినల్ కీ, రెస్సాన్స్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) బుధవారం విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఈరోజు(ఫిబ్రవరి 4) నుంచి ఈ నెల 6వ తేదీ 11.50 గంటలకు వరకు తెలిపేందుకు అవకాశం కల్పించింది.
అభ్యర్థులు నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్లి.. అక్కడ ఇచ్చిన లింక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కీ ఎంటర్ చేసి కీ, రెస్సాన్స్ షీట్ (అభ్యర్థులు రాసిన పరీక్షలకు సంబంధించిన మార్కుల డిజిటల్ షీట్) సరిచూసుకోవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 రుసుము నిర్ణయించారు. అభ్యంతరాల పరిశీలన ముగిశాక, ఈ నెల 12 లోపు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 14.5లక్షల మంది జేఈఈ మెయిన్ (JEE Main 2026) కు అప్లయ్ చేసుకున్నారు. వీరిలో 13 లక్షల మంది పరీక్షలు రాశారు.
Read Also: మరో ఆరుగురితో అరవ శ్రీధర్‌కు లింక్స్.. బాధితురాలి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


