epaper
Wednesday, February 18, 2026
epaper

మరో ఆరుగురితో అరవ శ్రీధర్‌కు లింక్స్.. బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ (Arava Sridhar) పై బాధితురాలు మరోసారి సంచలన విషయాలను బయటపెట్టారు. ఎమ్మెల్యేకు తనతోనే కాకుండా మరో ఆరుగురు అమ్మాయిలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనను దోషిగా చూపే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న వీడియోల గురించి స్పందిస్తూ.. ‘‘సేఫ్ సైడ్ కోసమే నేను వీడియోలు రికార్డు చేసుకున్నా. అయితే ఇవేవీ ఆయనకు తెలియకుండా చేసినవి కావు. శ్రీధర్‌కు చెప్పే నేను స్క్రీన్ రికార్డింగ్ చేశా’’ అని బాధితురాలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తనపై వస్తున్న బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలను కూడా తీవ్రంగా ఖండించారు. “ప్రస్తుతం బయటకు వచ్చిన ఆ ఆడియో నాది కాదు. నేను ఎవరినీ రూ. 25 కోట్లు డిమాండ్ చేయలేదు. కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ఐదు సార్లు అబార్షన్ అయిందని ప్రచారం చేస్తున్నారు. అది నిజమో కాదో వైద్య పరీక్షల్లో తేలుతుంది, నేను దేనికైనా సిద్ధం” అన్నారు. తాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న మాట నిజమే కానీ, ఆ సర్టిఫికెట్లు లేదా వివరాలు తనవి కావని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ (Arava Sridhar) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

 Read Also: రాజకీయ వేధింపులపై NHRCను ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>