కలం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో జేడీ చక్రవర్తి (JD Chakravarthy) మరో నటుడిపై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల కొత్త సినిమాలతో బిజీ అవుతున్న జేడీ ఓ ఇంటర్వ్యూలో ఓ సీనియర్ నటుడిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ హీరో అంటే తనకు చాలా చాలా గౌరవం ఉండేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో గొప్ప పేరున్న నటుడని చెప్పారు. అతడి పేరు మాత్రం చెప్పనంటూనే అతడి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయనకు గొప్ప పేరు ఉండటంతో మనిషి కూడా అంతే గొప్పగా ఉంటారని భావించినట్లు చెప్పారు. ఆయన షూటింగులకు ఆలస్యంగా వస్తారన్నారు. లొకేషన్లో వాళ్లను అడిగితే ఆయనకు రాత్రి తాగింది దిగలేదని, అందుకే లేట్‌గా వస్తారని చెప్పారని వెల్లడించారు. ఆయన ఏ హోటల్‌లో ఉన్నారని అడిగితే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని చెప్పారని తెలిపారు. అదేంటి ఆయనకు పెళ్లి అయింది కదా.. అని తాను షాకయ్యినట్లు వెల్లడించారు. అందుకే కొందరి గురించి గొప్పగా చెప్తారు కానీ అంత గొప్పగా ఉండరంటూ సెటైర్లు వేశారు. ఇక నెటిజన్లు ఈ వీడియోను చూసి ఇంతకీ ఆ హీరో ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు. కొందరు సీనియర్ ఎన్టీఆర్ అని, మరికొందరు బాలకృష్ణ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే జేడీ చక్రవర్తి మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

