Mobile Popup Ad
Mobile Popup Ad

స్కూళ్ల ప్రారంభం.. ఈ సారైనా బస్సులు వచ్చేనా?

కలం, జనగామ: పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. జనగామ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (Jangaon Students) మరోసారి ప్రయాణ ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ మండలం చౌడారం, వడ్లకొండ, ఓబుల్ కేశపూర్, చీటకోడూరుతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది చౌడారం ప్రాంతానికి చెందిన విద్యార్థులు బస్సుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు రోడ్లపై నిలబడి నిరసనలు తెలిపిన ఘటనలు ఉన్నాయి. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలలకు చేరుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. సరైన రవాణా సదుపాయం లేక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు కూడా ప్రభావితమైందని గుర్తు చేస్తున్నారు.

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని, రవాణా సౌకర్యాల్లో మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ డీఎం, అధికారులు గత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చౌడారం, కిలాషాపూర్, వడ్లకొండ, చీటకోడూరు తదితర గ్రామాల నుంచి విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>