నర్వ మండలం జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట జిల్లాలోని నర్వ మండలం (Narva Mandal) జాతీయ స్థాయిలో ఆదర్శ మండలంగా నిలవాలని, ఇక్కడ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా మన అందరం కలిసి పనిచేయాలని ఆ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Collector Priyanka) పిలుపునిచ్చారు. గురువారం నర్వ మండలం (యాస్పరేషన్ బ్లాక్) లోని యాంకీ గ్రామంలో నూతన కంటైనర్ అంగన్ వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచి కల్యాణితో కలిసి ఆమె ప్రారంభించారు. కేంద్రంలో సరస్వతి మాత చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంగన్ వాడీ కేంద్రంలో ఎంత మంది చిన్నారులు ఉన్నారని, ఎలా సాగుతుందో అంగన్ వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి చిన్నారి తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని, ఒక్క విద్యార్థి కూడా చదువు మానేయకుండా చూడడం మనందరి బాధ్యత అని తెలిపారు. చాలా సంవత్సరాలుగా ప్రారంభించాలని భావించిన ఈ అంగన్‌వాడీ కేంద్రం ఈరోజు ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, పరిశుభ్రంగా ఉపయోగించుకోవాలన్నారు.

అందరూ బాధ్యతతో సంరక్షించాలి..

ఇది సాధారణ భవనం కాకుండా కంటైనర్ మోడల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం అని, అందరూ బాధ్యతతో సంరక్షించాలని ఆమె తెలిపారు. గ్రామంలోని మరో ప్రాంతంలో కూడా అంగన్‌వాడీ కేంద్రం అవసరం ఉంటే, తప్పకుండా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. నర్వ మండలానికి ఏబీపీ (ABP) కింద ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, మండలానికి చెందిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు ఈ మండలంలో ఇంకా ఏయే వినూత్న కార్యక్రమాలు చేపట్టవచ్చో, ఇప్పటికే ఉన్న భవనాలను ఎలా మరింత మెరుగుపరచవచ్చో ఆలోచించి ప్రతిపాదనలు తీసుకురావాలని ఆమె సూచించారు.

ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..

గ్రామాల అవసరాలను యాస్పరేషన్ బ్లాక్ సమన్వయ కర్త దృష్టికి తీసుకువస్తే అందుబాటులో ఉన్న నిధుల నుంచి వాటికి ఆమోదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. నర్వ మండలంలోని (Narva Mandal) సర్పంచ్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నర్వ మండలంలో యాస్పరేషన్ బ్లాక్ కింద అనేక భవనాల నిర్మాణాలకు ఆమోదాలు ఇవ్వడం జరిగిందని, ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలకు కూడా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేస్తే, బిల్లులు కూడా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీఓ, అధికారులు, సర్పంచ్‌లకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులలో పత్తి, వరి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా కందులు, పెసర్లు వంటి స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఈ సందర్భంగా ఆమె రైతులకు సూచించారు. దీనివల్ల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతకు ముందు డీడబ్ల్యుఓ/ డీపీవో, డీఆర్డీవో, తహసిల్దార్, ఎంపీడీవో, సీడీపీఓలను కలెక్టర్ శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డీడబ్ల్యుఓ రాజేందర్ గౌడ్, డీఆర్డీవో/ డీపీవో వెంకట్ రాములు, తహసిల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయ కర్త బాలాజీ, సీడీపీఓ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read Also: రెడ్ అలర్ట్.. ముందస్తు చర్యలపై పొంగులేటి టెలికాన్ఫరెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>