కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Kushinagar Road Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్ లో ఆరుగురు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. హటా కోత్వాలి ప్రాంతంలోని NH-28పై థారువాడిహ్ సమీపంలో కారు ట్రక్కును ఢీకొట్టింది. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రక్కు ఢీకొట్టగా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ప్రథమ చికిత్స అనంతరం గోరఖ్పూర్ మెడికల్ కాలేజీకి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు సమాచారం.
బైకులను ఢీకొట్టిన కారు..
ఉత్తరప్రదేశ్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వెగంగా వెళ్తున్న కారు రెండు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు యువకులు రోడ్డుపై ప్రయాణిస్తుండగా వెనుకనుంచి వస్తున్న కారు బలంగా గుద్దింది. ప్రమాద తీవ్రతకు ద్విచక్రవాహనాలను కారు సుమారు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.

