epaper
Sunday, February 22, 2026
epaper

‘శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన కలెక్టర్’

కలం, జనగామ : చిన్న పిల్లలున్న మహిళలు ఆఫీసులకి వెళ్లాలంటే తమ పిల్లల్ని నెలకు వేల రూపాయలను ఖర్చు చేస్తూ డే కేర్ సెంటర్ (Day Care Center) లో వదిలి వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. అంతా ఖర్చు చేసిన అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారని తల్లి మనసు టెన్షన్ పడక తప్పదు. మరి కొంత మంది మహిళా ఉద్యోగులు తమ పిల్లలను అమ్మమ్మ, నానమ్మ దగ్గర వదిలి రావడం తప్పని పరిస్థితి. విధుల్లో నిమగ్నం అయినప్పటికీ.. పాపం ఆ తల్లి మనసు తమ చిన్నారి మీదకు లాగకుండా ఉండదు. అలాంటి తల్లుల బాధను తీర్చాలని.. వారు పని చేస్తున్న ఆఫీస్‌లోనే తమ బిడ్డలను చూసుకునే వెసులుబాటు కల్పించాలన్న కలెక్టర్ (Rizwan Basha Shaik) ఆలోచనతో..  కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఈ అవకాశం ఇప్పుడు జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు కూడా లభించింది.

5 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న పిల్లలను మహిళా ఉద్యోగులు ఆఫీస్‌కి వచ్చేటప్పుడు తమతో పాటు తమ చిన్నారులని తీసుకవచ్చి వారిని సంరక్షించేందుకు కలెక్టరెట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా (Rizwan Basha Shaik)షేక్ ప్రారంభించారు. అనంతరం చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన అట వస్తువులతో చిన్నారులు సంతోషంగా ఆడటం చూసి కలెక్టర్, డీసీపీ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ చిన్న పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టాలని, చిన్నారులని జాగ్రత్తగా చూసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు కలెక్టర్ తెలిపారు.

Read Also: నల్లగొండలో 41వేల ఎకరాలకు పడిపోయిన సాగు.. కలెక్టర్ కీలక సమావేశం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>