Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీలో నారా దేవాన్ష్‌పై జ‌న‌సేన ఎమ్మెల్యే పొగ‌డ్త‌ల వ‌ర్షం

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జ‌న‌సేన ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ (Konathala Ramakrishna) నారా చంద్ర‌బాబు కుటుంబ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సీఎం భార్య‌, కొడుకు, కోడ‌లు మొద‌లుకొని సీఎం మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ (Nara Devaansh) రికార్డుల‌ను స‌భ‌లో ఏక‌రువు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నారా లోకేశ్ ఆ మ‌ధ్య త‌న‌కు ఇంట్లో స‌భ్యుల‌తోనే పోటీ ఉంటుంద‌ని అన్నార‌ని, అలాగే దేవాన్ష్ రికార్డులు సృష్టిస్తున్నాడ‌ని కొణ‌తాల రామ‌కృష్ణ‌ చెప్పారు. దేవాన్ష్ ప‌ది సంవ‌త్స‌రాల్లోనై చైల్డ్ ప్రోడిగీగా రికార్డు సృష్టించార‌న్నారు. చెస్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వ‌ర్‌గా బిరుదు కూడా పొందార‌న్నారు.

2025లో వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకొని లండ‌న్ వెస్ట్ మినిస్ట‌ర్ హాల్‌లో పుర‌స్కారం కూడా అందుకున్నార‌న్నారు. ఇంత చిన్న వ‌య‌సులో ఈ ఘ‌న‌త సాధించ‌డం సామాన్య విష‌యం కాద‌న్నారు. అంతేకాకుండా 7 డిస్కులతో ఉన్న టవర్ ఆఫ్ హనోయ్ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడ‌న్నారు. 9 వేర్వేరు చెస్‌బోర్డులపై 32 చెస్ గుళికలను 5 నిమిషాలలోపే సరిగా అమర్చి మ‌రో రికార్డ్ సృష్టించాడ‌ని రామ‌కృష్ణ (Konathala Ramakrishna) తెలిపారు.

అంతేకాకుండా సీఎం చంద్ర‌బాబు భార్య నారా భువ‌నేశ్వ‌రికి (Nara Bhuvaneswari) 2025లో ఇండియ‌న్ డైరీ నుంచి ఔట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెష‌న‌ల్ అవార్డ్ అందించార‌న్నారు. నారా లోకేశ్ భార్య‌, బ్రాహ్మ‌ణికి గోల్డెన్ పీకాక్ ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గ‌వ‌ర్నెన్స్ అవార్డు వ‌చ్చింద‌న్నారు. యూకే కార్పొరేట్ ఎక్స్‌లెన్స్ వారు మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా అవార్డ్ కూడా ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఇలాంటి చ‌రిత్ర క‌లిగిన నాయ‌కులు రాష్ట్రంలో ఉండ‌టం గౌర‌వ ప్ర‌దంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబంపై జనసేన (Janasena) ఎమ్మెల్యే ఈ స్థాయిలో పొగడ్తల వర్షం కురిపించడంపై అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Read Also: రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్​ జెట్స్​.. సెంటర్​ ఓకే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>