కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ఇటీవల తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేయగా.. మంగళవారం కూటమి ప్రభుత్వం అరవ శ్రీధర్ రాజీనామాకు ఆమోదముద్ర వేసింది.
నిజానికి ఆయనపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. ఈ విచారణకు వెళ్లిన అరవ శ్రీధర్ ఈ వివాదంతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ బాధితురాలు మాత్రం సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఆరోపణలు చేశారు. దీంతో అరవ శ్రీధర్ తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు.

