Mobile Popup Ad
Mobile Popup Ad

అమల్లోకి న్యాయవాదుల రక్షణ చట్టం: ఉత్తర్వులు జారీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల భద్రత, రక్షణ కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక “తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం, (Advocates Protection Act) 2026” (తెలంగాణ యాక్ట్ నెం.16/2026) అమల్లోకి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్ జూన్ 2, 2026న జీఓ నెంబర్ 41 (G.O.Ms.No.41) ద్వారా అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. గవర్నర్ పేరిట న్యాయ వ్యవహారాలు, శాసనసభ విభాగాల ప్రభుత్వ కార్యదర్శి బి. పాపి రెడ్డి ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈ చట్టం యొక్క నిబంధనలు జూన్ 2, 2026 నుండి అధికారికంగా అమలులోకి వస్తాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఈ చట్టానికి సంబంధించిన ప్రత్యేక గెజెట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ అసాధారణ గెజెట్ సంచికలో వెంటనే ప్రచురించాలని ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చట్టం అమలుతో రాష్ట్రంలోని న్యాయవాదులకు చట్టపరమైన రక్షణ, భద్రత చేకూరనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>