వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి: కవిత

కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల (Velugumatla) బాధితులందరికీ న్యాయం చేయాలనే డిమాండ్ తో ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ బాధితులతో సమావేశమయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఖమ్మం ఖానాపురంలోని ఫూలే అంబేద్కర్ అధ్యయన వేదికలో కమిటీ ఎదుట వెలుగుమట్ల బాధితులు గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. తమ సొంత గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు తీసుకునేందుకు తాము ఒప్పుకోకున్నా ఒప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. టోకెన్ నంబర్ ఇచ్చి ఇంటి పట్టా ఇవ్వలేదని మరికొందరు వాపోయారని వివరించారు.

విజయలక్ష్మి అనే బాధితురాలి పేరుమీద టోకెన్ ఇచ్చి తెల్లారేసరికి తన పేరు మీద ఉన్న పట్టాను వేరే వాళ్లకు రాసిచ్చారని పేర్కొన్నారు. విజయలక్ష్మికి కేటాయించిన పట్టాను వేరేవారికి ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయంపై నిజ నిర్ధారణ కమిటీ బాధితురాలిని వెంటబెట్టుకొని జిల్లా కలెక్టర్ ను కలిసిందన్నారు. విజయ లక్ష్మికి కేటాయించిన పట్టాను తిరిగి తనకే ఇవ్వాలని కోరిందని చెప్పారు. వెలుగుమట్ల (Velugumatla) బాధితులకు ఇండ్ల పట్టాల కేటాయింపులో పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేశారు.

ఖమ్మం వెలుగుమట్ల బాధితులతో జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ సమావేశం అయ్యింది. ఖమ్మం ఖానాపురంలోని ఫూలే అంబేద్కర్ అధ్యయన వేదికలో బాధితులతో నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, వైస్ చైర్మన్ మేజర్ (రిటైర్డ్) మోహన్ కుమార్, సభ్యులు ప్రసాద్ (ఏఐఎఫ్ బీ నేషనల్ కౌన్సిల్ మెంబర్), తెలంగాణ విఠల్ (సోషల్ యాక్టివిస్ట్), అనురాధ (ఐఎఫ్ టీయూ), ప్రొఫెసర్ నాగం కుమారస్వామి (హెచ్ వోడీ, పొలిటికల్ సైన్స్, పాలమూరు యూనివర్సిటీ), ప్రొఫెసర్ రామయ్య యాదవ్ (హెచ్ వోడీ, సోషియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ), క్రాంతి (సీనియర్ జర్నలిస్ట్), సుంకరి నరేశ్ (హైకోర్టు అడ్వొకేట్), శ్రావణ్ గౌడ్ (హైకోర్టు అడ్వొకేట్), నూర్జహాన్ (హైకోర్టు అడ్వొకేట్), ఆకాశ్ కొల్లూరు (సీనియర్ జర్నలిస్ట్) మాట్లాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>