కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే మెదక్ అభివృద్ధి: జగ్గారెడ్డి

కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాల పాలనలో ఓడీఎఫ్, బీఈఎల్, బీడీఎల్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు. నెహ్రూ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ జంక్షన్ వద్ద నెహ్రూ విగ్రహానికి టీజీఐఐసీ మాజీ ఛైర్‌పర్సన్ నిర్మలతో కలిసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సింగూరు, మంజీర ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీటి సౌకర్యాలు అందాయని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నాటిన అభివృద్ధి మొక్కలు నేడు మహావృక్షాలుగా మారి, ప్రజలకు ఫలాలను అందిస్తున్నాయని అభివర్ణించారు. వారి సేవలను ప్రతి తరం గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>