Mobile Popup Ad
Mobile Popup Ad

జ‌బ‌ర్ద‌స్త్‌ మ‌హేశ్ షాకింగ్ వీడియో.. అస‌లేమైంది?

క‌లం, వెబ్ డెస్క్: జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్‌ (Jabardasth Mahesh)గా పాపుల‌ర్ అయి వెండితెర మీద రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి వంటి భారీ చిత్రాల‌తో మంచి గుర్తింపు సాధించిన క‌మెడియ‌న్ మ‌హేశ్ తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. జీవితం అస్స‌లు ఊహించ‌నిద‌ని, బ‌య‌ట క‌నిపించే వాటిని బ‌ట్టి దేన్నీ గుడ్డిగా న‌మ్మొద్ద‌ని ఆయ‌న వీడియోలో చెప్పారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో త‌న గురించి వ‌చ్చే ట్రోల్స్, మీమ్స్ ఆధారంగా ఎలాంటి ముంద‌స్తు ఊహాగానాలు ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఆయ‌న స్వ‌యంగా మ‌ళ్లీ అస‌లు నిజాలు చెప్తాన‌ని అన్నారు. దీంతో అస‌లు మ‌హేశ్ దేని గురించి మాట్లాడుతున్నాడ‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.

అయితే మ‌హేశ్ వీడియో వెనుక కార‌ణాల‌పై నెటిజ‌న్లు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ‌ధ్య సెల‌బ్రెటీలు త‌మ కొత్త సినిమాల‌కు వినూత్నంగా ప్ర‌మోష‌న్లు చేసుకుంటున్నారు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా బ్రాండ్ల ప్రమోషన్లకు ఇదే దారి ఎంచుకుంటున్నారు. గొడ‌వ ప‌డిన‌ట్లు, ఏదో జ‌రిగిన‌ట్లు క్రియేట్ చేసి ఫైన‌ల్‌గా ఇది త‌మ ప్ర‌మోష‌న్‌లో భాగ‌మ‌ని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆయన వ్యక్తిగత విషయానికి సంబంధించినవా, లేక ఏదైనా మూవీ ప్రాజెక్ట్ ప్రమోషన్‌లో భాగమా అనేది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>