హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టళ్లలో ఆహారంపై పరిమితులు

కలం, వెబ్ డెస్క్ : ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ (IT Corridor Hostel Association)  ఒక ముఖ్య ప్రకటన విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా LPG గ్యాస్ సిలిండర్‌ల కొరత (LPG Shortage) ఏర్పడింది. దీనితో హైదరాబాద్ (Hyderabad) ఐటీ కారిడార్ ప్రాంతంలోని హాస్టళ్లలో తాత్కాలికంగా కొన్ని ఆహార పరిమితులు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం తాత్కాలికంగా టీ, కాఫీ అందించబడవు. అలాగే ఎక్కువ సమయం పట్టే లేదా ఎక్కువ నూనె వినియోగించే చపాతీ, దోసె, పూరి వంటి అల్పాహార పదార్థాలను కూడా నిలిపివేస్తున్నారు. పరిస్థితిని బట్టి కొన్ని కూరలు, అదనపు ఫుడ్ ఐటమ్స్ కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

అయితే విద్యార్థులకు అన్నం, ఇతర ప్రాథమిక భోజన పదార్థాలు మాత్రం యథావిధిగా అందిస్తామని తెలిపారు. అలాగే హాస్టళ్లలో ఉన్న సెల్ఫ్ కుకింగ్ సదుపాయాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితి పూర్తిగా తాత్కాలికమేనని, గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన వెంటనే అన్ని వంటకాలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని అసోసియేషన్ పేర్కొంది. హాస్టల్ యాజమాన్యాలు ప్రత్యామ్నాయ వంట విధానాలను అమలు చేసి, పరిస్థితి గురించి విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.

Read Also: డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>