ట్రంప్ నకు ఇజ్రాయెల్ ఝలక్..!

కలం, వెబ్ డెస్క్ : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రతిపాదించిన ఈ ప్రణాళికపై అభ్యంతరాలు తెలిపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ఆదివారం వెల్లడించారు.

హమాస్ పూర్తిగా నిరాయుధులయ్యే వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగబోదని ఆయన తేల్చి చెప్పారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలో పురోగతి సాధించినట్లు గత నెలలోనే గత నెలలో ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణతో ఈ ప్రణాళిక అమలు అవుతుందని కూడా వెల్లడించారు.

అయితే, గత ఏడాది ఇరు పక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో గాజాలో యుద్ధం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా గాజాపై పాలన సాగించిన హమాస్‌ను పూర్తిగా నిరాయుధులను చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది.

మరోవైన తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో భాగంగా హమాస్ తన ఆయుధాలను వదిలివేయడానికి అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైఖరి కీలకంగా మారింది. హమాస్ పూర్తిగా నిరాయుధులయ్యే వరకు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేయడంతో గాజా శాంతి ప్రక్రియపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>