యువతే దేశ భవిష్యత్.. యువజన కాంగ్రెస్ నేతల పిలుపు

కలం, దేవరకొండ: యువతను రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతం చేసి దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని దేవరకొండ (Devarakonda) నియోజకవర్గ యువజన కాంగ్రెస్ (Youth Congress) అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం దేవరకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి కిన్నెర హరికృష్ణ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రసూతి పొందిన బాలింతలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని అన్నారు. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవుల కోసం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతను స్వీకరించడమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడ సైదులు, నేనావత్ మోతిలాల్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కేతావత్ రమేష్, ప్రధాన కార్యదర్శులు ఏకుల అంబేద్కర్, ఉమేర్ ఖాషీం, దుబ్బ చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగటి హరీష్, మండల అధ్యక్షులు ముకురోజు రాజు, సాయి రాథోడ్, నీలం ఆంజనేయులు యాదవ్, రమేష్ నాయక్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>