మహబూబ్‌ నగర్‌లో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మహబూబ్‌ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని ఎస్టీ స్టడీ సర్కిల్‌లో ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ, గిరిజన వర్గాల హక్కులు, సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, విద్యాభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. స్టడీ సర్కిల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఛత్రు నాయక్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>