కుంటాలలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ.. ఘనంగా నివాళులు

కలం, కుంటాల: తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు (MLA Pawar Ramarao Patel) పటేల్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ (Chakali Ilamma Statue) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, ఒక సమాజానికో పరిమితమైనది కాదన్నారు. నిజాం పాలనలో అణచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల కోసం నిలబడిన ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఐలమ్మ ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ఆమె స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>