Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమేనీ మృతికి ప్ర‌తీకారం తీర్చుకుంటాం.. ఐఆర్‌జీసీ హెచ్చరిక

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అలీ ఖ‌మేనీ (Ali Khamenei) మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసంలో జరిగిన దాడిలో ఖ‌మేనీ మరణించినట్లు ధృవీకరించింది. ఆయన మృతికి దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించింది.

ఖ‌మేనీ మృతిపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై చరిత్రలోనే ఎప్పుడూ చూడ‌ని అత్యంత భ‌యంక‌ర‌ దాడి చేస్తామ‌ని హెచ్చరించింది. ఖ‌మేనీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ మేర‌కు ఐఆర్‌జీసీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇరాన్ జాతి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంద‌ని, ఈ దారుణానికి కారణమైన వారిని విడిచిపెట్టద‌ని పేర్కొంది. దేశ రక్షణ దళాలు, బసీజ్ బలగాలు ఖ‌మేనీ మార్గంలోనే ముందుకు సాగుతూ, దేశంపై జరిగే అంతర్గత, బాహ్య కుట్రలకు బ‌ల‌మైన స‌మాధానం చెప్తామ‌ని తెలిపింది. ఇరాన్ కేబినెట్ కూడా ఈ ఘటనను భారీ నేరంగా అభివర్ణిస్తూ, దీనికి తగిన సమాధానం తప్పక ఇస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్నాయని ప్రకటించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>