ఆరెంజ్​ అలర్ట్​.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

కలం, వెబ్​ డెస్క్​: మురసు తుఫాన్​ ఎఫెక్ట్​ తెలంగాణ రాష్ట్రంపై కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్​ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Telangana Rains ) కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) హెచ్చరించింది. సోమవారం నాడు ఖమ్మం, నల్లగొండ,  నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.

అలాగే హైదరాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్​ నగర్​, వరంగల్​, హనుమకొండ, మేడ్చల్​, రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో మోస్తరు వర్షాలు (Telangana Rains) కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>