కలం, వెబ్ డెస్క్ : ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు (Hardik Pandya) క్రికెట్ వరల్డ్ లో మంచి గుర్తింపు ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఎప్పుడైతే మహికా శర్మతో (Mahieka Sharma) డేటింగ్ మొదలు పెట్టాడో.. అప్పటి నుంచో అతనిపై విమర్శలు, ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బహిరంగంగానే పాండ్యా చేస్తున్న కొన్ని పనులు దారుణమైన ట్రోల్స్ కు దారి తీస్తున్నాయి. నిన్న టీ20 వరల్డ్ కప్ ను (T20 World Cup) ఇండియా గెలవడంతో దేశమంతా సంబురాలు చేసుకుంటోంది. అయితే ఆటగాళ్లు కూడా నిన్న రాత్రి గ్రౌండ్ లో తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు.
కానీ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) తన గర్ల్ ఫ్రెండ్ తో గ్రౌండ్ లో చేసిన పనులు తీవ్రమైన విమర్శలకు దారి తీశాయి. మహికాతో కలిసి పిచ్చిపిచ్చిగా డ్యాన్సులు చేయడం.. ఏకంగా ట్రోఫీ ఇచ్చే స్టేజిపై ఇద్దరూ కాసేపు అలా పడుకోవడం.. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా ఇద్దరూ ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గ్రౌండ్ లో ఇలా బిహేవ్ చేయడం ఏంటని తిట్టిపోస్తున్నారు. మిగతా క్రికెటర్లు కూడా తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చినా.. ఇలా బిహేవ్ చేయలేదని చెబుతున్నారు. పాండ్యా తనకున్న విలువను గర్ల్ ఫ్రెండ్ వల్ల పోగొట్టుకోవద్దని ఆయన అభిమానులు కోరుతున్నారు.
Read Also: వరల్డ్ కప్ విజయంపై కోహ్లీ రియాక్షన్ ఇదే!
Follow Us On: Instagram

