Mobile Popup Ad
Mobile Popup Ad

టిఫిన్ సెంటర్ వేదికగా క్రికెట్ బెట్టింగ్.. ఖమ్మంలో ముఠా గుట్టురట్టు!

కలం, ఖమ్మం బ్యూరో: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా క్రికెట్ బెట్టింగ్స్‌కు చెక్ పడటం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల్లో బెట్టింగ్స్‌కు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం (Khammam) జిల్లా, కొణిజర్ల మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో ఓ టిఫిన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా పోలీసులకు పట్టుబడింది. గురువారం వైరా ఏసీపీ సారంగపాణి మీడియాకు కీలక విషయాలను తెలియజేశారు. తనికెళ్ల గ్రామంలోని అమ్మ టిఫిన్ సెంటర్ వద్ద ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై సూరజ్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించాడు.

నిర్వాహకుడు గుగులోత్ వెంకటేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3 వేలు నగదు, బెట్టింగ్‌కు సంబంధించిన 8 రాత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు అక్కడి నుంచి పరార్ అయ్యారు. మొబైల్ ఫోన్ కాల్స్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ (IPL Cricket Betting) నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ మేరకు నిందితులపై కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెట్టింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఏసీపీ సారంగపాణి యువతకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>