‘తమిళనాడులో ఎన్నికలు వద్దు’.. డీఎంకే కీలక తీర్మానం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని తాము భావించడం లేదని డీఎంకే (DMK) పార్టీ స్పష్టం చేసింది. చెన్నైలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.

స్టాలిన్ నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం..

తమిళనాడు ప్రజలు, మిత్రపక్షాలకు డీఎంకే పార్టీ ధన్యవాదాలు తెలిపింది. ‘రాష్ట్రం , డీఎంకే పార్టీ కోసం దశాబ్ధాలుగా కృషి చేస్తున్న పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు ధన్యవాదాలు. స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. పార్టీ కట్టుబడి ఉంటుంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వమే ఉండాలనేది డీఎంకే భావిస్తోంది. మళ్లీ ఎన్నికలు కోరుకోవడం లేదు. ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా తీసుకోదల్చుకోలేదు. ప్రస్తుత రాజకీయ, పరిపాలనా సంక్షోభ పరిస్థితుల్లో స్టాలిన్ తీసుకునే నిర్ణయాలకు పార్టీ ఆమోదం తెలుపుతుంది’ అని పేర్కొంది.

‘కాంగ్రెస్ పార్టీది నమ్మకద్రోహం…’

సెక్యులర్ ప్రొగ్రెసివ్ కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్లిపోవడాన్నిడీఎంకే తీవ్రంగా ఖండించింది. ‘ఇది నమ్మకద్రోహమే, ఆ పార్టీ తన పాత అలవాటుని వదిలిపెట్టుకోలేకపోయిందని విమర్శించింది. డీఎంకేతో కూటమిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి కేటాయించిన ఒక రాజ్యసభ, 28 అసెంబ్లీ ఎన్నికలను వెంటనే తమ పార్టీ నేతలతో భర్తీ చేసుకోవాలని భావిస్తోంది’ అని వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>