కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామంలోని మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ నల్ల పోచమ్మ (Borancha Nalla Pochamma) అమ్మవారిని అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ (Naina Jaiswal) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు పండితులు పూర్ణకుంభంతో వేదపారాయణతో స్వాగతం పలికారు. నైనా జైస్వాల్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సతీమణి అనుపమ రెడ్డి కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Read Also: రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటన షురూ
Follow Us On : WhatsApp

