కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కు ఎందుకు నొప్పి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) చురకలంటించారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఏనాడు కూడా ఆ మాట అనలేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని కేటీఆర్ బడాయి కబుర్లు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ హయాంలో కేవలం 12 గంటలు మాత్రమే ఉచిత కరెంట్ ఇచ్చారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేటెంట్ ఉచిత విద్యుత్ అని.. ఉచిత విద్యుత్ పైన తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారని ఆయన తెలిపారు. గత యాసంగి సీజన్ లో విద్యుత్ ఇవ్వలేదని ఏ సబ్ స్టేషన్ దగ్గర చిన్న ధర్నా కూడా జరగలేదని.. ఇదే తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
రైతు ప్రయెజనాల కోసమే నూతన డిస్కం ఏర్పాటు చేసినట్లు ఆది స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అని సీఎం స్పష్టం చేశారన్నారు. అయినా పని గట్టుకుని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్లు పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదా అని రేవంత్ విసిరిన సవాల్ ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

